Telangana Assembly ఎన్నికల్లో దాదాపుగా రాజకీయ పార్టీలు అన్నీ ఒంటిరిగానే బరిలోకి దిగాలని భావిస్తున్నాయి. 2004, 2009, 2014, 2018 ఎన్నికల్లో కూటములుగా బరిలోకి దిగిన పార్టీలు ఈ సారిమాత్రం సింగిల్ ఫైట్ కే సై అంటున్నారు. అధికార TRS Party ఒంటరిగానే ఫైట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. BJP కూడా అదే బాటలో ఉంది. Janasenaతో ఉన్నప్పటికీ ఆ పార్టీకి పెద్దగా క్యాడర్ లేకపోవడంతో బీజేపీతో కూడా సింగ్ ల్ ఫైటే. ఇక Congress పార్టీ నేతలు బహిరంగంగానే ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్ష్యుడికి తేల్చి చెప్పారు. సింగ్ ల్ పైట్ సూపర్ బెస్ట్ అని. తాజాగా బీఎస్సీ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కూడా తమ పార్టీ కూడా ఒంటరిగానే బరిలో దిగుతోంది. అయితే ఈ సారి పార్టీలకు అతీతంగా బలమైన అభ్యర్థులకు ప్రజలు ఒట్లు వేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.